Wednesday, October 4, 2023

కారు బోల్తా.. ఒక‌రు మృతి, ముగ్గురికి గాయాలు

కారు బోల్తా ప‌డి ఒక‌రు మృతిచెందగా, మ‌రో ముగ్గురు గాయ‌ప‌డిన విషాద ఘ‌ట‌న వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని దారూరు మండల పరిధిలోని గట్టుపల్లి గేట్ సమీపాన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణంలోని ఇందిరా నగర్ కు చెందిన భార్యాభర్తలిద్దరూ పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. సురేష్ అనే వ్యక్తి నగర పరిధిలోని జీడిమెట్ల పోలీస్ స్టేష‌న్ లో హోంగార్డు (1588) గా, భార్య రేణుక మైలార్ దేవరపల్లి పోలీస్ స్టేషన్ లో (1207) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. వీరికి అశ్విత్, యశ్వంత్ ఇద్దరు పాప, బాబు ఉన్నారు. గురువారం రోజు అన్నకూతురు వివాహానికి తాండూర్ కు తన సొంత వాహనంలో కుటుంబంతో (TS 34e 8385) తాండూర్ కి వస్తుండగా మార్గమ‌ధ్య‌లో గట్టేపల్లి గేటు సమీపాన మూలమలుపులో కారు బోల్తా పడింది. సురేష్ అక్కడికక్కడే మృతి చెందగా, అత‌ని భార్య, పిల్లలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండిhttps://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement