Sunday, December 4, 2022

అనంత‌గిరి ఘాట్ రోడ్డులో బ‌స్సు బోల్తా.. ఒక‌రు మృతి..

వికారాబాద్ జిల్లా అనంత‌గిరి ఘాట్ రోడ్డులో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఒక‌రు మృతి చెంద‌గా.. ప‌లువురు ప్ర‌యాణికులకు గాయాల‌య్యాయి. వెంట‌నే స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్న పోలీసులు ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీశారు. స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టి గాయ‌ప‌డిన వారిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాద స‌మ‌యంలో బస్సులో 70 మంది ఉన్న‌ట్లు, బ్రేకులు ఫెయిల్ కావ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు. ఇంకా పూర్తి విరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement