Friday, February 3, 2023

భారాస పార్టీ ఎంపి రంజీత్ రెడ్డి ఫేస్ బుక్ హ్యాక్…

హైద‌రాబాద్ – సైబ‌ర్ నేర‌గాళ్లు ప్ర‌ముఖుల సోష‌ల్ మీడియా ఖాతాల‌పై క‌న్ను వేస్తున్నారు.. వారి వారి ఖాతాల‌ను హ్యాక్ చేసి డ‌బ్బులు డిమాండ్ చేయ‌డం కూడా కొన్ని సంద‌ర్భాల‌లో జ‌రుగుతున్న‌ది.. తాజాగా టిఎస్ ఆర్టీసీ ఎండి సజ్జాన్నార్ ట్విట్ట‌ర్ ఖాతాను నేటి ఉద‌యం హ్యాక్ కు గురికాగా, ఇప్పుడు భారాస పార్టీ ఎంపి రంజీత్ రెడ్డి ఫేస్ బుక్ ఖాతాను హ్యాక్ చేశారు.. విష‌యాన్ని గుర్తించిన ఎంపి వెంట‌నే సైబ‌ర్ సెల్ కు ఫిర్యాదు చేశారు.. దీనిపై సైబ‌ర్ సెల్ సిబ్బంది విచార‌ణ జ‌రుపుతున్నారు.. హ్యాక్ ఈజిప్ట్ నుంచి జ‌రిగిన‌ట్లుగా భావిస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement