Sunday, April 14, 2024

ఘనంగా అంబేద్కర్‌ జయంతి వేడుకలు..

చౌదరిగూడెం : చౌదరిగూడ బస్టాండ్‌ ఆవరణలో తెరాస నాయకుల ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ 130వ జయంతి వేడులను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెరాస మండల అధ్యక్షుడు సయ్యద్‌ హఫీజ్‌ మాట్లాడుతూ ప్రపంచ మేధావి డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కుల నిర్ములనపై అంటరానితనం పోరాటం చేసిన మహనీయులు ‌ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు గూడ స్వామి, ఎంపిటిసిలు ప్రమోదు రావు, డి. రాములు, నర్సిములు, సింగిల్‌ విండో డైరెక్టర్‌లు అబ్దుల్‌ జబ్బార్‌, నారాయణగౌడ్‌, సీనియర్‌ నాయకులు యాదయ్య, మండల ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మల్లేష్‌, వీరన్న, నసీర్‌, తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement