Tuesday, September 26, 2023

కౌకూర్ లో వ్యక్తి దారుణ హత్య..

జవహర్ నగర్, మార్చ్ 3 (ప్రభ న్యూస్) : జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చోటుచేసుకుంది. పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌకూర్ భరత్ నగర్ లో శుక్రవారం అలీ ఖాన్ (37) ను కిరాతకంగా కొట్టి చంపారు. మృతుడు గతంలో ఓ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడని, అంతేకాకుండా సంవత్సరం క్రితం పెద్దలు ఎదురించి ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న జవహర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, వివిధ కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ప్రేమ వివాహమా లేదా పాత కక్షల కారణంగా ఈ దారుణానికి పాల్పడ్డారా అని పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement