Thursday, September 21, 2023

శంకర్‌పల్లి బీడీఎల్ చౌరస్తాలో 228 కిలోల గంజాయి పట్టివేత..

శంకర్ పల్లి (ప్రభ న్యూస్) : శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బీడీఎల్ చౌరస్తాలో పోలీసుల తనిఖీలలో బయటపడ్డ 228 కిలోల గంజాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రి నుండి మహారాష్ట్రకు తరలించే క్రమంలో శంకరపల్లి పోలీసులు వాహనాల తనిఖీలలో పట్టుకున్నారు. ఇద్దరు వ్యక్తులు సైద్ ఖాన్ షరీఫ్ ఖాన్, జావిద్ భవాని బొలెరో వాహనంలో నిషేధిత డ్రగ్స్ గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుండి బొలెరో వాహనంతో పాటు మూడు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు శంకర్ పల్లి పోలీసులు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement