Monday, January 30, 2023

పెద్దపల్లిలో ఘనంగా రంజాన్ వేడుకలు

పవిత్ర రంజాన్ వేడుకలు పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. మంగళవారం పెద్దపెల్లి పట్టణ శివారులోని ఈద్గా వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పవిత్ర రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నూతన వస్త్రాలు ధరించి ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొనెందుకు వేలాదిగా తరలిరావడంతో సందడి వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement