Thursday, April 25, 2024

TRS పార్టీకి గ‌ట్టు రామ‌చంద్ర‌రావు రాజీనామా

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ పార్టీకి గట్టు రామచంద్రరావు రాజీనామా చేస్తూ.. సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆపార్టీ అధినేత‌, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు కు కూడా గట్టు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. తాను ఆశించిన స్థాయిలో పార్టీలో రాణించలేకపోయాను… కేసీఆర్‌ అభిమానం పొందడంలో గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమయ్యానన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో పార్టీలో కొనసాగడం కరెక్టు కాదని తాను భావించాను. అందుకే టీఆర్‌ఎస్‌ పార్టీకి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. త‌న‌ రాజీనామా లేఖను ఆమోదిస్తారని కేసీఆర్ ను కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement