Friday, April 19, 2024

రాజన్నను దర్శించుకున్న డీజీపీ – ప్రత్యేక పూజలు

వేములవాడ, (ప్రభన్యూస్‌): సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ హౌసింగ్‌ బోర్డు చైర్మన్‌ కోలేటి దామోదర్‌లు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కోడె మొక్కు చెల్లించుకున్న అనంతరం స్వామి వారికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చ‌కులు ఘన స్వాగతం పలికారు. దర్శనం అనంతరం డీజీపీకి స్వామి వారి చిత్రపటం, ప్రసాదం అందించి అధికారులు సన్మానించగా, అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. ఈకార్యక్రమంలో ఆలయ ఏఈఓ బ్రహ్మన్నగారి శ్రీనివాస్‌, ప్రోటోకాల్‌ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, నులిగొండ రాజేందర్‌, జిల్లా ఎస్పీ రాహుల్‌ హెగ్డే, డీఎస్పీ చంద్రకాంత్‌, పోలీస్‌ సిబ్బంది, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement