Wednesday, November 6, 2024

TG | హైకోర్టులో రాజ్ పాకాల లంచ్ మోషన్ పిటిషన్..

జన్వాడ రేవ్ పార్టీ కేసులో మోకిలా పోలీసులు కేటీఆర్ బావమరిది రాజ్‌ పాకాలకు నోటీసులు ఇచ్చారు. బీఎన్ఎస్ యాక్ట్ 35(3) సెక్షన్ ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

అయితే రాజ్‌ పాకాల ఇంట్లో లేకపోవడంతో ఓరియన్ విల్లాస్‌లోని నెంబర్ 40 విల్లాకు ఈ నోటీసులను పోలీసులు అంటించారు. జన్వాడ ఫామ్‌హౌస్‌లో జరిగిన పార్టీకి సంబంధించిన కేసులో విచారించాల్సి ఉందని, ఈ రోజు (సోమవారం) తమ ముందు విచారణకు హాజరు కావాలని సదరు నోటీసుల్లో పోలీసులు కోరారు.

అలాగే అడ్రస్ ప్రూఫ్‌తో పాటు, కేసుకు సంబంధించిన ఇతర ఆధారాలు సమర్పించాలని సూచించారు. అంతేకాకుండా ఒకవేళ ఈ నోటీసులను బేఖాతరు చేసి విచారణకు హాజరుకాని పక్షంలో చట్టపరంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఎట్టి పరిస్థితుల్లో నేడు మోకిలా పీఎస్‌లో స్వయంగా హాజరు కావాలని, లేకుండా బీఎన్ఎస్ యాక్ట్ 35(3), (4), (5), (6) సెక్షన్ల కింద అరెస్ట్ చేయాల్సి ఉంటుందని నోటీసుల్లో పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు.

- Advertisement -

అయితే పోలీసులు తనని అక్రమంగా అరెస్టు చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారన్న సమాచారం నేపథ్యంలో రాజ్ పాకాల హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement