Saturday, April 20, 2024

అలర్ట్: ఇవాళ, రేపు భారీ వర్షాలు

తెలంగాణ లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండం, బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో కూడిన ఉపరితల ఆవర్తనం ఏర్పడటం వలన భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. వీటి ప్రభావంతో ఈశాన్య, ఉత్తర తెలంగాణ జిల్లాలో నేడు, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నిన్న కూడా రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పెంట్లంలో అత్యధికంగా 6.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాగా, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం కురుస్తూనే ఉంది.

ఇది కూడా చదవండి: ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక అధ్యక్షుడిగా అలీ అహ్మద్ జలాలీ

Advertisement

తాజా వార్తలు

Advertisement