Saturday, March 25, 2023

ఆకాల వ‌ర్షం – అపార న‌ష్టం..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు అకాల వర్షాలు అన్నదాతలను ముంచేస్తు న్నాయి. ఊహించని విధంగా సంభవిస్తున్న తుపానులు వ్యవసాయ రంగాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. విపత్కర పరిస్థితులు తలెత్తిన సందర్భాల్లో రైతుల పరిస్థితి దయనీయంగా మారు తోంది. కొన్ని జిల్లాల్లో భారీగా పంటనష్టం జరిగింది. రంగా రెడ్డి, మహబూబ్‌నగర్‌ సహా ఆరు జిల్లాల్లో చేతికొచ్చిన పంట లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వరి, మొక్కజొన్న, ఉల్లి, వేరు శనగ పంటలు, మామిటి, అరటి, బొప్పాయి తోటలు భారీగా నష్టపోయినట్లు బాధితులు వాపోతున్నారు. దంచి కొట్టిన వడ గండ్లతో హైదరాబాద్‌ నగరం అతలాకుతలమైంది. తీవ్రమైన ట్రాఫిక్‌ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులను ఎదుర్కొ న్నారు. అయినా, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కొనసాగు తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వడగండ్ల వానలు కురుస్తున్నాయి. అకాల వర్షాలకు పలు జిల్లాల్లో పంటలకు తీరని నష్టం వాటిల్లింది. ఈదురు గాలులతో విరుచుకుపడుతున్న వానలు రైతులను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల వడగండ్ల వర్షం కురి సింది. దీంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ఎల్లా రెడ్డిపేట వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్‌,.. తంగళ్ళపల్లి, బోయిన్‌పల్లి, గంగాధర, భీమారం, రామడుగు, మాన కొండూరు, చొప్పదండి మండ లాల్లో కొన్ని చోట్లలో వడగండ్ల వాన, మరికొన్ని చోట్లలో అతిభారీ వర్షం దంచి కొట్టింది.

పెద్దపల్లి జిల్లాలోనూ పలుచోట్ల వర్షం పడింది. కరీంనగర్‌ జిల్లా గంగాధర, రామడుగు మండలాల్లో వడగండ్లతో రైతు లకు తీవ్ర నష్టం వాటిల్లింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. మోత్కురు, ఆత్మ కూరు, గుండాల మండలాలలో పంటలు దెబ్బతిన్నాయి. వాటిల్లింది. చేతికందొచ్చిన వరిపంట నేలవాలింది. ఈదురు గాలులు, వడగండ్ల వర్షంతో మామిడికాయలు రాలిపో యాయి. వరి నేల వాలి చిరుపొట్ట దశలోని పంట చేతికి అంద కుండా పోయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటలు వర్షార్పణం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని వారు కోరుతు న్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్‌, బిచ్కుంద, జుక్కల్‌, పెద్ద కొడంగల్‌ మండలాల్లో బలమైన ఈదురు గాలులతో వడగండ్లు కురిశాయి. సుమారుగా గంట పాటు- కురిసిన భారీ వర్షానికి రోడ్లన్ని జలమయమయ్యాయి. దీంతో ఈదురుగాలులకు పలు గ్రామాల్లో చెట్లు- విరిగిపడటంతో రాకపోకలకు అంత రాయం ఏర్పడింది. నిజామాబాద్‌ జిల్లా దర్పల్లి మండలంలో, వికారాబాద్‌ జిల్లా మోమిన్‌పేట్‌ మండలం చక్రంపల్లిలో వడగండ్ల వాన కురిసింది. డిచ్‌పల్లి మండల పరిధిలోని ఉల్లి పంట తీవ్రస్థాయిలో దెబ్బతింది.

మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో వడగండ్ల వాన దంచి కొట్టింది. జనగామ జిల్లా పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో వడగండ్ల వర్షం కురిసింది. భూపాలపల్లి జిల్లా రేగొండ, చిట్యాల, టేకుమట్ల, మొగుల్లపల్లి మండలాల్లో.. నిర్మల్‌ జిల్లా భైంసా, కుబీర్‌, కుంటాల, ముథోల్‌, తానూర్‌ మండలాల్లో భారీ వర్షం పడింది. ఫలితంగా అంచనాకందని పంటనష్టం వాటిల్లింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనూ భారీ వర్షానికి రోడ్లపై వరదనీరు ప్రవహించింది.

- Advertisement -
   

జంట నగరాల్లో పలు ప్రాంతాల్లో వడగండ్ల వర్షం
హైదరాబాద్‌లో వరుణుడు మరోసారి ప్రతాపం చూపిం చాడు. రెండు రోజులుగా దంచి కొడుతున్న వర్షాలకు హైదరాబాద్‌ మహానగరం తడిసి ముద్దయింది. శనివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు అనేక ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. నగరంలో గత నాలుగు రోజులుగా ఆకాల వర్షాలు కురవడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఏర్పడుతున్నాయి. రోడ్లు, లోతట్టు- ప్రాంతాలు జలమయమయ్యాయి. జంట నగరాల్లో పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసి ముద్ద య్యారు. ఒక్కసారిగా వాతావరణం మేఘావృతమై పలు చోట్ల వడగండ్లు కురిశాయి. సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, తిరు మలగిరి, ఆల్వాల్‌, ప్యారడైజ్‌ ,మాదాపూర్‌, హైటెక్‌ సిటీ-, కుత్బుల్లాపూర్‌, కేపీహెచ్‌బీ, దుండిగల్‌ ప్రాంతాల్లో వడగండ్ల వాన కురిసింది. జీడిమెట్ల, సూరారం, జగద్గిరిగుట్ట, గండి మైసమ్మ, మియాపూర్‌, చందానగర్‌, పటాన్‌చెరు తదితర ప్రాంతాల్లో వడగండ్ల వర్షం దంచి కొట్టింది.
బోయిన్‌పల్లి, మారేడ్‌పల్లి, చిలకలగూడ, బేగంపేట్‌, ప్యాటీ-్న, తిరుమలగిరి, కూకట్‌పల్లి, హైదర్‌నగర్‌, జీడిమెట్ల ప్రాంతాల్లో జోరు వాన కురిసింది. కాప్రా, ఈసీఐఎల్‌, చార్మినార్‌, బహదూర్‌పురా, యాకుత్‌పురా, చాంద్రాయణగుట్ట, బార్కస్‌, ఫలక్‌నామ, బోడుప్పల్‌, ఉప్పల్‌, రామంతాపూర్‌, పీర్జాది గూడ ప్రాంతాల్లో వర్షం దంచి కొట్టింది. ఆల్విన్‌ కాలనీ, బాచుపల్లి, నిజాంపేట్‌లో చిరుజల్లులు కురిశాయి. ఏకధాటిగా కురిసిన వర్షానికి వరదనీరు రహదారుల పైకి వచ్చి చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నగరంలో కురిసిన వర్షంతో లోతట్టు- ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలోనే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు.

కొత్త సచివాలయం పక్కన నేలకొరిగిన భారీ వృక్షం
మరోవైపు లక్డీకపూల్‌ నుంచి తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌కు వెళ్లే మార్గంలో భారీ వృక్షం నెలకొరిగింది. నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం ప్రహరీ గోడ కోసం గుంత తీస్తుండగా చెట్టు-కు సపోర్ట్‌ లేకపోవడంతో ఒక్కసారిగా రోడ్డుపై కూలిపోయింది. దీంతో అక్కడే నిలిపిన ఉన్న రెండు వాహనాలు ధ్వంసమ య్యాయి. సమయానికి అక్కడ ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చెట్టు-ను తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement