Thursday, April 25, 2024

జగిత్యాలలో మరోసారి భారీ వర్షం..

వరుణుడి స్వల్ప విరామం తరువాత తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లను పలకరించాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ ఉదయం 8 గంటల వరకు జగిత్యాల జిల్లా కోరుట్లలో 12.9 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది. దీంతో మరోసారి వరదలు పొటెత్తాయి. ఆ తర్వాత వికారాబాద్‌ జిల్లా పుట్టపహాడ్‌లో 11.5 సెంటీమీటర్లు, సిద్దిపేట జిల్లా దూల్‌మిట్టాలో 10.7 సెం.మీ, జనగామ జిల్లా బచ్చన్నపేటలో 9.9 సెం.మీ, మహబూబ్‌నగర్‌ జిల్లా మహ్మదాబాద్‌లో 9.2 సెం.మీ, కరీంనగర్‌ జిల్లా నుస్తులాపూర్‌లో 8.6 సెం.మీ, భద్రాద్రి జిల్లా పెంట్లంలో 8 సెం.మీ వాన పడింది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌, పెద్దపల్లి, వరంగల్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

ఇది కూడా చదవండి: నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ క్రస్ట్ గేట్ల మూసివేత..

Advertisement

తాజా వార్తలు

Advertisement