Sunday, May 16, 2021

హైదరాబాద్ లో మరోసారి భారీ వర్షం..

హైదరాబాద్ లో  భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా, ఎండగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం వరకు మారిపోయింది. మధ్యాహ్నం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడి వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయం కావడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కల్గుతుంది. వర్షం కురిసే ముందు ఈదురుగాలులు వీయడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అటు తెలుగురాష్ట్రాల్లోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలో మరో మూడు రోజులు తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు తెలిపింది వాతావరణ శాఖ.

Advertisement

తాజా వార్తలు

Prabha News