Thursday, April 25, 2024

రాహుల్ గాంధీ పాదయాత్రలో తోపులాట.. మహారాష్ట్ర మాజీ మంత్రి కంటికి తీవ్ర గాయం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర హైదరాబాద్ లో కొనసాగుతోంది.బుధవారం కూకట్ పల్లిలో రాహుల్ గాంధీని కలిసేందుకు జనం పోటెత్తడంతో తోపులాటకు దారితీసింది. వెనకనుంచి జనం దూసుకుని రావడంతో మహారాష్ట్ర మాజీ మంత్రి నితిన్ రౌత్ కు గాయాలయ్యాయి.దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లోని వాసవి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వెంటనే ఆయనను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన కంటికి అయిన గాయం తీవ్రత ఎక్కువగానే ఉందని వైద్యులు చెప్పారు. నితిన్ రౌత్ భారత్‌ జోడో యాత్రలో పాల్గొన్న సమయంలో పోలీసులు నెట్టివేయడంతో ఈ ఘటన జరిగినట్టుగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. నితిన్ రౌత్ కుడి కన్ను, చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. కాగా, జోడో యాత్రలో భాగంగా తనను కలిసేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు కిందపడిపోవడంతో రాహుల్ చేయందించారు. పైకిలేపి నీళ్లు తాగించి సపర్యలు చేశారు. కూకట్‌పల్లిలోని ఓ కేఫ్‌‌లో రాహుల్ గాంధీ టీ తాగారు. అక్కడున్న కరాటే విద్యార్ధులతో కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం లంచ్ కోసం మదీనాగూడలో ఆగారు. రాత్రికి యాత్ర ముత్తంగి చేరుకుంటుందని, రాహుల్ రాత్రికి అక్కడే బస చేస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement