Saturday, April 20, 2024

Breaking: టీపీసీసీ నేతలతో నేడు రాహుల్ గాంధీ భేటీ..

తెలంగాణ కాంగ్రెస్‌ పై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. ఏఐసీసీ అగ్ర నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో టీపీసీసీ నేతలు సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతంపై ప్రధానంగా చర్చించనున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా భేటీలో కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు సమాచారం. వరి సేకరణ అంశంపై కూడా సమావేశంలో ప్రధాన అజెండాలో చర్చ జరగనుంది. రాహుల్ గాంధీ నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌తోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి సహా పలువురు ముఖ్యనేతలు సహా మొత్తం 38 మందితో ఈ సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో విభేదాలు, రేవంత్‌పై సీనియర్ల అసంతృప్తి, కొంతమంది నేతలు పార్టీతో వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని అధిష్టానం కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నాయకుల మధ్య విభేదాలకు ముగింపు పలికేలా అధిష్టానం చర్యలు ఉంటాయని నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్‌ ముఖ్య నేతలకు పార్టీ రాహుల్ గాంధీ దిశానిర్దేశం చేయనున్నారని తెలుస్తోంది.

తెలంగాణ పార్టీ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం కావడం ఇది రెండోసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించి.. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బిజెపి, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుం సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే ఉన్నారు. ఈ తరుణంలో ఈ సమావేశం జరగనుండడం ప్రాధాన్యత ఏర్పడింది. 2018లో తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ ప్రభుత్వ పునరాగమనాన్ని ఆపలేకపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement