Wednesday, April 17, 2024

అండర్‌ గ్రౌండ్ ప‌నుల్లో నాణ్యత నిల్.. రొడ్లపై పొంగుతున్న డ్రైనేజీలు

ప్రభ న్యూస్‌ : ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం మురికివాడను సైతం అభివృద్ధి పరుస్తూ నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని చూస్తుంటే అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ల కక్కుర్తితో అభివృద్ధి పనులు మూన్నాళ్ల ముచ్చటగా మారుతున్నాయి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడంతో డ్రైనేజి నిర్మించిన కొద్ది రోజులకే మ్యాన్‌ హొల్స్‌ పగిలిపోతున్నాయి. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించక పోవడానికి కారణం కాంట్రాక్టర్‌ కక్కుర్తితో పాటు, ఇంజినీరింగ్‌ అధికారులకు కాంట్రాక్టర్‌ ఇస్తున్న అమ్యామ్యాలే కారణామని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంజినీరింగ్‌ అధికారులు, కాంట్రాక్ట ర్లు నాణ్యతాప్రమాణాలను మరిచి పనులు నిర్వహిస్తున్నా.. స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకపోవడంతోనే అధికారులు, కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా ప్రవర్తిసున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు పొంగిపొర్లుతున్న డ్రైనేజి, మరోవైపు నూతనంగా నిర్మించిన డ్రైనేజి మ్యాన్‌ హోల్‌ పగిలి ఛిద్రంగా మారుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement