Thursday, March 28, 2024

మణుగూరు ఓ-18 ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభం.. దేశంలో హెవీ వాటర్‌ ప్లాంట్‌ ఇదొక్కటే..

అశ్వాపురం, ప్రభ న్యూస్‌: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌లో నూతనంగా ఏర్పాటు-చేసిన ఓ-18 ప్లాంటు-లో ఉత్పత్తిని డి.ఏ. ఈ.చైర్మన్‌ వ్యాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంగళవారం ప్రారంభించారు. మరో విశిష్ట అతిథి ముంబై ఏవి వాటర్‌ బోర్డ్‌ డైరెక్టర్‌ (ఆపరేషన్‌) వివిఎస్‌ ప్రసాదరావు ప్రత్యక్షంగా హాజరయ్యారు. మణుగూరు ఏ వి వాటర్‌ ప్లాంట్‌ లో తయారైన హెవీ వాటర్‌ నుండి బై ప్రోడక్ట్‌ దీన్ని తీస్తారు.. ఓ-18 ప్లాంట్లు- ఇప్పటివరకు చైనా, ఆస్ట్రేల్రియా, అమెరికా, రష్యా, ఇజ్రాయిల్‌ ఈ 5 దేశాల్లో మాత్రమే ఉన్నాయి. 6వ ప్లాంటు-ను దేశంలో మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌లో నెలకొల్పారు. ఓ-18 ప్లాంటు- మణుగూరులో నెలకొల్పటంతో భారతదేశం కూడా ప్రపంచ దేశాల సరసన చేరింది.

ఈ ప్రొడక్ట్స్‌ క్యాన్సర్ను కనుగొనేందుకు ఫార్మాస్యూటికల్స్‌ వాడుతారు. ఈ ప్రొడక్ట్స్‌ వల్ల సామాన్యులకు కూడా తక్కువ ధరకు క్యాన్సర్‌ మందు లభ్యం కానున్నాయి. ఓ-18 ప్లాంటు-ను ప్రత్యేకంగా పరిశీలించటానికి వచ్చిన విశిష్ట అతిథి ముంబై హెవీ వాటర్‌ బోర్డు డైరెక్టర్‌ ఆపరేషన్‌ వీవీఎస్‌ ప్రసాదరావు ప్రొడక్షన్‌ను నేరుగా బొంబాయి తీసుకొని వెళ్లారు. ఈ ప్రొడక్ట్స్‌ను జనవరి 26 భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఎర్రకోట వద్ద జాతీయ జెండా ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం… లేదా భారత రాష్ట్రపతి చేతులమీదుగా గాని జాతికి అంకితం చేయనున్నట్లు- సమాచారం. ప్లాంట్‌ ప్రారంభ కార్యక్రమంలో మణుగూరు భారజల కర్మాగారం జనరల్‌ మేనేజర్‌ జి సతీష్‌, డిజియంలు సుధాకర్‌, ఉపాధ్యాయ .వెంకటేష్‌, సీఈఓ కాంబ్లే, భారతీయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

టీఎన్టీయూసీ అభినందనలు…
మణుగూరు హెవీ వాటర్‌ ప్లాంట్‌లో నెలకొల్పిన ఓ 18 ప్లాంట్లో ఉత్పత్తిలో భాగస్వామ్యం వహించిన అధికారులకు ఉద్యోగులకు మణుగూరు ఏ వి వాటర్‌ ప్లాంట్‌ టీ-ఎన్టీయూసీ ట్రేడ్‌ యూనియన్‌ అభినందనలు తెలిపింది. మణుగూరు ఏ వి వాటర్‌ ప్లాంట్‌ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement