Saturday, April 20, 2024

రికార్డుస్థాయిలో పూర్త‌వుతున్న.. తెలంగాణలో చేప‌ట్టిన ప్ర‌తిష్టాత్మ‌క నిర్మాణ‌ప‌నులు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్

స‌మైక్య రాష్ట్రంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణానికి 12ఏళ్ల స‌మ‌యం ప‌ట్టింద‌ని..ఇప్పుడు అక్క‌డే స‌మాంత‌రంగా నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి నిర్మాణం పనులు కేవలం 12 నెలల్లో పూర్తి చేస్తున్నాం అన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. అప్పనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి పనులను సంబంధిత అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణపనులు రికార్డుస్థాయిల్లో పూర్తవుతున్నాయన్నారు. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో బ్రిడ్జి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించామని’ ఆయన వివరించారు. తెలంగాణకు ముందు కనీసం ఒక్క బ్రిడ్జి కూడా లేకపోవడంతో నిత్యం గంట గంటకోసారి రైల్వే గేటు పడడం వల్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడేదని మంత్రి తెలిపారు.

అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలనుకునే వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉండేదని గుర్తు చేశారు. కేవలం ఏడాది కాలాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని రెండో బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రెండో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు మొత్తం నాలుగు లైన్ల రహదారి అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని వెల్లడించారు. విమానాశ్రయానికి కేవలం గంట వ్యవధిలో ప్రయాణించే వెసులు బాటు కలుగుతుందని తెలిపారు. డిసెంబర్ చివరి నాటికి బ్రిడ్జి పనులు మొత్తం పూర్తవుతుండగా రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్మించాల్సిన స్లాబ్ గడ్డర్లు ఆలస్యం అవ్వడం వల్ల ఒక నెల రోజుల సమయం అదనంగా పడుతోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement