Thursday, March 28, 2024

Prestigious: బుర్జ్ ఖలీఫాపై మ‌న బతుకమ్మ.. ప్ర‌పంచ ప్ర‌జ‌ల‌కు క‌నువిందు

వ‌ర‌ల్డ్ లోనే అతిపెద్దదైన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై మ‌న బతుకమ్మ సంబురం అంగ‌రంగ వైభ‌వంగా సాగింది. శ‌నివారం రాత్రి రెండుసార్లు.. 9.40 గంటలకు ఒకసారి, 10.40 గంటలకు మరోసారి మూడు నిమిషాలపాటు బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మ వీడియోను ప్రదర్శించారు. అలాగే, సీఎం కేసీఆర్ ఫొటోలతోపాటు జైహింద్, జై తెలంగాణ, జై కేసీఆర్ అనే నినాదాలు కూడా ప్రదర్శించారు. దీన్ని ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది వీక్షించారు.

ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో రూపొందించిన పాటతో పాటు రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ బుర్జ్ ఖలీఫాపై కనిపించగానే, కార్యక్రమానికి హాజరైన తెలంగాణ ప్రవాసులు జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు.

తెలంగాణ మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత బుర్జ్ ఖలీఫా వద్ద బతుకమ్మ ఆడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించడం ఒక్క తెలంగాణకే కాదని, మొత్తం దేశానికే గర్వకారణమన్నారు. బతుకమ్మ ప్రదర్శనకు సహకరించిన యూఏఈ ప్రభుత్వానికి, బుర్జ్ ఖలీఫా నిర్వాహకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement