Friday, December 6, 2024

తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

నాగర్ కర్నూల్, జిల్లా ప్రతినిధి (మార్చ్ 23) ప్రభా న్యూస్ : తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆరెస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… గ్రూప్ వన్ పేపర్ లీకేజీ దేశద్రోహం కన్నా దారుణమైన విషయమ‌న్నారు. గ్రూప్ వన్ పరీక్షల పేపర్ లీకేజీ వ్యవహారం సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గ్రూప్ వన్ పేపర్ లీకేజీ ధనిక పిల్లలకు ఉన్నత ఉద్యోగాలు కట్టబెట్టేదిగా చేస్తున్న కుట్రని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ పునర్నిర్మాణం 5వ ఉద్యమం చేయాలని, అందుకు బడుగు, బలహీన, ధనిక, పేదలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధం ఉన్నట్టు అనుమానాలు వస్తున్నాయన్నారు. గ్రూప్ వన్ పేప‌ర్ లీకేజీ పై సుప్రీంకోర్టుకు వెళ్తామని ఆయన అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement