Friday, October 11, 2024

TG: హైదరాబాద్​ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ కు చేరుకున్నారు. ఒక రోజు పర్యటన నిమిత్తం ఇవాళ‌ ఉదయం 11:50 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి..గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, సీఎస్, నగర మేయర్, అధికారులు, తదితరులు ఘన స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా ఆమె మేడ్చల్ జిల్లా శామీర్ పేటలోని నల్సార్ లా యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అనంతరం బొల్లారంలోని రాష్ట్రపతి నినవాసానికి చేరుకుని అక్కడ భారతీయ కళా మహోత్సవాన్ని ప్రాభించనున్నారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement