Sunday, March 24, 2024

పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్స్.. తెలంగాణకు రెండు రజతాలు..

హైదరాబాద్‌, ప్ర‌భ‌న్యూస్: నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌షిప్‌ గ్రాండ్‌గా ముగిసింది. మూడురోజులపాటు జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో 500మందికిపైగా అథ్లెట్లు పాల్గొన్నారు. ఎల్బీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌ను తెలంగాణ పవర్‌లిఫ్టింగ్‌ చైర్మన్‌, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ రంగేశ్వరి విజయవంతం చేసేందుకు చాలా కృషి చేశారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశంసించారు. టోక్యో ఒలింపిక్స్‌లో మన అథ్లెట్లు మంచి ఫలితాలను సాధించి పతకాలును దేశానికి అందించా రన్నారు. ఒలింపిక్స్‌లో పవర్‌ లిఫ్టింగ్‌ క్రీడను ఉంచేలా కృషి చేస్తామని కిషన్‌రెడ్డి అథ్లెట్లుకు హామీ ఇచ్చారు.

ఈ ఛాంపియ న్‌షిప్‌లో మహిళల 63కిలోల విభాగంలో మహారాష్ట్రకు చెందిన అలిఫియా ప్రథమం స్థానం సాధించగా, 76కిలో విభాగంలో మహారాష్ట్రకి చెందిన సనా ముల్లా, 84కిలోల కేటగిరిలో శ్వేతా సావంత్‌, జూనియర్‌ ఉమెన్‌ 69కిలోల విభాగంలో మహారాష్ట్రకు చెందిన స్లావే, 76కిలోల విభాగంలో రితిక, 84కిలోల విభాగంలో మరియ ముఫసిల్‌ పటేల్‌ విజేతలుగా నిలిచారు. 63కిలోల విభాగంలో తెలంగాణకు రెండు రజతాలు దక్కాయి. సాయి లలిత్‌కుమార్‌ 105కిలో విభాగంలో రజతం గెలిచాడు. సబ్‌ జూనియర్‌ విభాగంలో కన్హయ్య (మహారాష్ట్ర), హరీష్‌ చౌరసియా (యూపీ) విజేతలుగా నిలిచారు. జూనియర్‌ విభాగంలో వెంకటేశ్‌ కొనార్‌ (మహారాష్ట్ర), గౌరవ్‌ భోళా (మహారాష్ట్ర), మాస్టర్‌ విభాగంలో మనోజ్‌మోరే (మహారాష్ట్ర), అమిత్‌ (ఢిల్లిd), సబ్‌ జూనియర్‌ ఉమెన్‌ విభాగంలో నిధి సాహు (చత్తీస్‌గఢ్‌), జెన్నిఫర్‌ బానో (తమిళనాడు), జూనియర్‌ మహిళా విభాగంలో ఆస్థాసింగ్‌ (యూపీ), గురు సిమ్రన్‌ కౌర్‌ (పంజాబ్‌), మాస్టర్‌ విభాగంలో యోగేష్‌ చౌదరి (హర్యానా), సనా ముల్లా (మహారాష్ట్ర) విజేత లుగా నిలిచారు. సబ్‌ జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌, , జూని యర్‌ ఛాంపియన్‌షిప్‌ను ఉత్తరప్రదేశ్‌ కైవసం చేసుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement