Friday, April 19, 2024

పోలీసులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, యోగా, ధాన్యం చేయాలి: సీపీ చంద్రశేఖర్ రెడ్డి

పోలీస్ అధికారులు సిబ్బంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం కమిషనరెట్ హెడ్ క్వార్టర్స్ లో గోదావరిఖని సబ్ డివిజన్ సివిల్ పోలీస్, ఆర్మూడ్ రిజర్వ్ పోలీస్ సిబ్బందికి వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ కి సీపీ హాజరై గౌరవ వందనం స్వీకరించి తరువాత సిబ్బంది ప్రదర్శించిన ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, లాఠీ డ్రిల్, ట్రాఫిక్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్ సిబ్బంది ప్రదర్శనని తిలకించారు. ఈ సందర్బంగా సీపీ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ఆరోగ్య కారణాల వల్ల మరియు రోడ్డు ప్రమాదం వల్ల సిబ్బంది మరణించడం జరిగిందని.. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు. రోజు ఉదయాన్నే కనీసం ఒక అరగంట యోగ, ధ్యానం, నడక ఏదో ఒకటి చేయాలని, సాధ్యమైనంత వరకు బయట ఆహారం తినడం మానివేయాలన్నారు. రెగ్యులర్ గా హెల్త్ చెకప్ చేసుకోవాలని తెలిపారు.

వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి క్రమశిక్షణ, యూనిటీ గా ఉండడం, ఫిజికల్ ఫిట్నెస్ కి ఉపయోగపడుతుంద‌ని సీపీ తెలిపారు. ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణం చేసేటప్పుడు సీటు బెల్టు ధరించాలని సిబ్బందికి సూచించారు. మంచిగా ప్రజల మన్ననలు పొందేలాగా పనిచేస్తూ పోలీస్ శాఖకి, రామగుండం పోలీస్ కమిషనరేట్ కి మంచి పేరు వ‌స్తుంద‌న్నారు. ఏదైనా సమస్య ఉంటే ఆఫీస్ కి రావచ్చు అని సిబ్బందికి సీపీ తెలిపారు. పరేడ్ లో గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, ఆర్ఐ లు మధుకర్, శ్రీధర్, విష్ణు ప్రసాద్ గోదావరిఖని టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, రాజ్ కుమార్ , గోదావరిఖని టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, రామగుండం సర్కిల్ ఇన్స్పెక్టర్ కనతల లక్ష్మీనారాయణ, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ, ఆర్ఎస్ఐలు, సిబ్బంది హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement