Wednesday, April 24, 2024

నిరుద్యోగులకు పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉచిత శిక్షణ

అచ్చంపేట, ప్రభన్యూస్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భారీ ఎత్తున పోలీస్‌ కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాల నియమకాల నోటిఫికేషన్‌ జారీ చేయనున్న నేపథ్యంలో జిల్లాలో నిరుద్యోగులైన యువతి యువకులకు తోడ్పాటు అందించుటకు జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో యువతకు ఉచిత పోలీసు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అసక్తి గల అభ్యర్ధులు ఇప్పటికే తమ పరిధిలోని పోలీస్‌ స్టేషన్‌లలో పేర్లు నమోదు చేసుకున్నారు.

అభ్యర్థుల ఎంపికను ఈ నెల 5న ఉదయం 9.30 గంటలకు నాగర్‌ కర్నూలు జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ప్రక్కన ఉన్న సాయి ఫంక్షన్‌ హాల్‌లో ప్రవేశ పరీక్ష నిర్వించబడుచున్నది. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని జిల్లా ఎస్పీ కే. మనోహర్‌ తెలిపారని అచ్చంపేట సిఐ అనుదీప్‌, ఎస్సై ప్రదీప్‌ కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement