Friday, April 19, 2024

రక్తదానం మరొకరికి ప్రాణదానం

రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల ఆపద సమయంలో మరొకరి ప్రాణం కాపాడుతుందన్నారు. యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎందరో పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల వల్ల ప్రస్తుతం సమాజంలో శాంతి నెలకొందన్నారు. అమరుల త్యాగాలను స్మరిస్తూ రామగుండం కమిషనరేట్ పరిధిలోని రెండు జిల్లాలో వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పెద్దపల్లి పోలీస్ శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం రక్తదానం చేసిన దాతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి రవీందర్, ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, ఇంద్రసేనారెడ్డి, అనిల్, ఎస్ఐ లు రాజేష్, ఉపేందర్, వెంకటేష్, లక్ష్మణ్, శ్రీనివాస్, జానీ పాషా, రాజ వర్ధన్, పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ మందల వాసుదేవ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులు రాజగోపాల్ రెడ్డి, వెంకట్ ట్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement