Sunday, June 4, 2023

9 ఏండ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ – స్పీకర్ పోచారం

బాన్సువాడ , మార్చ్ 28 ప్రభ న్యూస్ – తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కేవలం 9 సంవత్సరాల కాలంలో కెసిఆర్ నేతృత్వంలో, సంక్షేమ రంగాలలో దేశంలోని మిగతా రాష్ట్రాల కన్నా ఆదర్శంగా నిలిచిందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ డివిజన్లోని ఇబ్రహీంపేట్ గ్రామంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణతోపాటు 29 రాష్ట్రాలు ఉన్న ఆ రాష్ట్రాలలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లో లేవని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో సాధించుకున్న తెలంగాణ ఎలా అభివృద్ధి చేయాలో గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల అవసరాలను బట్టి సంక్షేమ పథకాలు ఎన్నికల మేనిఫెస్టోలో లేని సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసి నిరుపేదలకు అన్ని విధాల ఆదుకుంటున్నారని ఆయన అన్నారు ‌‌. ఇల్లు లేని పేదలకు సొంతం నివాసం ఉండాలని మంచి ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి 100 శాతం సబ్సిడీతో డబల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరుపేదలకు అందిస్తున్నారని ఆయన అన్నారు.గత ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు పేదలకు సొంత ఇంటి నిర్మాణం కోసం అంజయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 400 రూపాయలు, మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1000 రూపాయలు, నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 6000 రూపాయలు రూపాయలు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నలభై వేల రూపాయలు, వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 70 వేల రూపాయలు లబ్ధిదారులకు ఇచ్చేవారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమంలో ప్రతి పల్లెలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకొని అధికారం వచ్చిన తర్వాత ఏ సమయంలో ప్రజలకు ఏం లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. ప్రస్తుతం డబల్ బెడ్ రూమ్ ఐదులక్షల నాలుగు రూపాయలు నగదు చెల్లిస్తున్నారని అవి లబ్ధిదారులు తిరిగి చెల్లించకుండా పూర్తి ఉచితంగానే అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి దేనని ఆయన అన్నారు.

గతంలో 70000 రూపాయలలో సగం మాఫీ సగం బాకీ అన్నట్టుగా గత ప్రభుత్వాలు లబ్ధిదారులకు చెల్లించాలని ఆయన అన్నారు. ప్రస్తుతం మొత్తం రూపాయలు ఐదు లక్షల నాలుగు రూపాయలు ఉచితంగానే 100 శాతం సబ్సిడీపై లబ్ధిదారులకు అందించామని, రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో బాన్స్వాడ నియోజకవర్గానికి 11వేల ఇండ్లు మంజూరయ్యాయి ఇప్పటికే 7000 నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు కూడా అయినయని ఆయన అన్నారు. ఇందులో 3000 కాంట్రాక్టర్ల ద్వారా కట్టిస్తే మిగతా 8 వేలఇండ్లను లబ్ధిదారులు కట్టుకున్నారని ఆయన అన్నారు. ఇలా సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, తెలంగాణ రాష్ట్రంలో 13 లక్షల మందికి బాన్సువాడ నియోజకవర్గం లో 13,500 మంది యువతులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా నగదు సహాయం అందించామని ఆయన అన్నారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి నగదు సాయం చేయడం కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే మాత్రమే ఉన్నదని ఆయన అన్నారు. రైతులకు రైతుబంధు పథకం ద్వారా ఎకరాకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం ఇస్తూ, ఇప్పటివరకు రాష్ట్రంలో 68 వేల కోట్లు రైతులకు అందించామని, రైతు బీమా ద్వారా చనిపోయిన రైతుకు కుటుంబానికి 5 లక్షలు ఇస్తున్నామని ఆయన అన్నారు. దేశంలో అత్యధికంగా 46 లక్షల మంది పేదలకు ఆసరా పెన్షన్లు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం కంటే పెద్ద రాష్ట్రాలు అయినా గుజరాత్ లో కేవలం 12. 40 లక్షల మందికి, మహారాష్ట్రలో 31.50 లక్షల మందికి పెన్షన్లు ఆ ప్రభుత్వాలు అందిస్తున్నాయని ఆయన అన్నారు. ఆసరా పేషన్లో కోసం నెలకు 1. 250 కోట్లు చొప్పున ఏడాదికి 15. 000 కోట్లను తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తుందని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఇస్తున్న పెన్షన్ రూపాయలు 2016 మరియు వికలాంగులకు ఇస్తున్న పెన్షన్లు 3016 రూపాయలు దేశంలోనే అత్యధికం, పక్కనున్న మహారాష్ట్ర కర్ణాటకలో మనకంటే తక్కువ పెన్షన్లు లబ్ధిదారులకు ఇస్తున్నారని, పెన్షన్లు రానివారు ఎవరు దిగులు చందవద్దని త్వరలోనే అరవైన వారందరికీ పెన్షన్లు మంచిరవుతాయని త్వరలోనే మూడు లక్షల రూపాయల పథకం వస్తుందని అర్హులైన వారందరికీ ఇల్లు మంజూరు చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండటానికి అంగన్వాడి కేంద్రాల్లో పోస్ట్లు ఆహారం అందిస్తున్నామని, గర్భిణులకు మరింత బలవర్ధకం కోసం నూతనంగా కేసీఆర్ న్యూట్రిషన్ కి అందిస్తున్నామని డెలివరీ అయిన తర్వాత కెసిఆర్ కి ఇస్తున్నామని ఆయన వివరించారు. తల్లిపాలు ప్రాముఖ్యత గురించి వివరించిన ప్రోత్సహించినందుకు బాన్సువాడ మాతా శిశు ఆసుపత్రికి భారతదేశంలోని జాతీయ అవార్డు వచ్చిందని, ఈ అవార్డు పొందిన దేశంలోని ఏకైక ప్రభుత్వం ఆస్పత్రి మన బాన్సువాడ ఆసుపత్రి కావడం నాకెంతో సంతోషాన్నిచ్చిందని ఆయన అన్నారు.

ఇబ్రహీంపేట్ గ్రామంలో ఆంజనేయ స్వామి మందిరం కోసం 24 లక్షల మంజూరైన మందిరానికి భూమి పూజ, ముదిరాజ్ సంగం కమ్యూనిటీ భవనం 20 లక్షలు భవన ప్రారంభోత్సవం చేశారు. అదేవిధంగా బోయ సంఘం ప్రహరీ గోడకు పది లక్షలు, ముదిరాజ్ సంఘ భవనానికి 20 లక్షలు, మైనార్టీ స్మశాన వాటిక ప్రవార్రిగూడ 17 లక్షలు, గ్రామపంచాయతీ కాంపౌండ్ వాల్ 12 లక్షలు, మన ఊరు మనబడి ప్రారంభోత్సవం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం 11 లక్షల 80 వేల భవనానికి ప్రారంభోత్సవం ఈ కార్యక్రమాలు శంకుస్థాపనలు భూమి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్, ఆర్డిఓ రాజా గౌడ్, బాన్సువాడ ఎంపీపీ దొడ్ల నీరజ వెంకటరామిరెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు రైతు సమన్వయ సమితి అంజిరెడ్డి,

Advertisement

తాజా వార్తలు

Advertisement