Saturday, March 25, 2023

బరంగ్ ఎడ్గి సర్పంచ్ మృతికి స్పీకర్ పోచారం సంతాపం

బీర్కూర్ మార్చి 14 – ప్రభ న్యూస్: బీర్కూరు మండలంలోని బరంగ్ ఎడ్గి గ్రామ సర్పంచ్ పోస్ట్ లక్ష్మి సోమవారం రాత్రి మృతి చెందిన విషయం తెలుసుకున్న పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం సర్పంచ్ లక్ష్మి స్వగృహం కు చేరుకొని సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం లక్ష్మీ భర్త రమేష్ ను పిల్లలను ఓదార్చారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచ్ లక్ష్మీ మృతి వారి కుటుంబంనికి తీరని లోటు అన్నారు. అంతేకాకుండా ప్రజల్లో మమేకమై, ఆమె చేసిన సేవను కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు మాజీ జెడ్పిటిసి సతీష్, ఎంపీపీ రఘు ఎంపీటీసీ సందీప్ పటేల్, బైరాపూర్ ఏఎంసీ చైర్మన్ రామకృష్ణ గౌడ్, కిష్టాపూర్ సర్పంచ్ పుల్లెనీ బాబు రావు, మండల లోని అన్ని గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement