Friday, April 19, 2024

అజ్ఞాతంలో పెద్దపల్లి జడ్పీఛైర్మన్‌ పుట్టమధు…

హైదరాబాద్, : పెద్దపల్లి జడ్పీఛైర్మన్‌ పుట్టమధు గత ఆరు రోజులుగా అందుబాటులో లేరు. ఫోన్‌ స్విచ్చాఫ్‌లో ఉంది. ఈనెల 30వ తేదీ నుండి గురువారం వరకు పుట్టమధు ఆచూకీ లభించకపోగా, గురువారం పుట్టమధు భార్య శైలజ మధు కనిపిం చడంలేదని, సీఎం దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 30న ఇంటెలిజెన్స్‌ అధికారులు హైద రాబాద్‌కు వచ్చి కలవాలని సూచించ డంతో, వామనరావు కేసు చుట్టుకుం టుందేమోనన్న ఆందోళనతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారన్న ప్రచార ముంది. మరోవైపు మంత్రివర్గం నుండి తొలగించబడ్డ ఈటల రాజేం దర్‌కు సన్నిహితుడన్న పేరుండడం వల్ల ఇబ్బంది
పెడతారన్న అనుమానంతో కనిపించకుండా వెళ్ళారన్న చర్చలు ఉన్నాయి. గన్‌మెన్లను సరెండర్‌ చేసి, వాహనాన్ని వదిలేసి, మొబైల్‌ స్విచ్చాఫ్‌ చేసి.. మధు ఎక్కడికి వెళ్ళారన్న అంశంపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. పుట్టమధు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వీరవిధేయుడు. తాజా రాజకీయ పరిణామాలకు పుట్టమధు.. జాడ లేకపోవడానికి సంబంధం ఉందా? వామన రావు కేసే కారణమా? ప్రజాజీవితంలో ఉన్న వారు ఇలా జాడలేకపోవడం.. పార్టీకి కూడా చెడ్డపేరు తెచ్చే పరిణామం కాదా? అని రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి. మధు అజ్ఞాతం వీడితే కానీ అసలు కారణాలు తెలియవు.

Advertisement

తాజా వార్తలు

Advertisement