Monday, December 9, 2024

Peddapalli – నడిచి వెళుతున్న మహిళలను ఢీకొన్న కారు – స్పాట్ లో ఇద్దరు దుర్మరణం

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘటన పెద్దపల్లి, ఆంధ్రప్రభ రాజీవ్ రహదారి వెంట నడుచుకుంటూ వెళుతున్న మహిళల వెనక నుండి కారు ఢీ కొట్టిన ఘటనలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది.

జిల్లా కేంద్రం లోని ఉదయ నగర్ కు చెందిన ముగ్గురు మహిళలు ఆర్ఆర్ గార్డెన్స్ లో పని ముగించుకొని ఇంటికి వెళ్తుండగా కరీంనగర్ నుండి పెద్దపల్లి వైపు వస్తున్న కారు ఆదర్శనగర్ వద్ద వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుక్క అమృత, కుక్క భాగ్య లు అక్కడికక్కడే మృతి చెందగా కుక్క పద్మ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పద్మను 108 సిబ్బంది ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స ప్రారంభించారు. సమాచారం అందుకున్న పెద్దపెల్లి సిఐ ప్రవీణ్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదానికి కారణమైన కారు మహిళలను ఢీ కొట్టిన అనంతరం ఆగకుండా వెళ్లిపోవడంతో కారు ఎక్కడిది అనే కోణంలో సిసి ఫుటేజ్ లు పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ ప్రవీణ్ తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement