Saturday, April 20, 2024

Pedapally : ఘనంగా సురక్ష దివస్ వేడుకలు.. పోలీస్ వాహ‌నాల‌తో ర్యాలీ

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడవరోజు సురక్ష దివస్ వేడుకలు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆదివారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ వాహనాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించి.. పోలీసులు ఉపయోగిస్తున్న ఆయుధాలు వాటి పనితీరును వివరించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, డిసీపీ వైభవ్ గైక్వాడ్, ఏసీపీలు మహేష్, మోహన్ లతోపాటు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement