Friday, April 19, 2024

హుజరాబాద్‌లో దళిత బంధు ఆపొద్దు: హైకోర్టులో పిటిషన్

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళిత బంధు పథకం హుజురాబాద్ లో బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఉపఎన్నిక ముగిసే వరకు హుజురాబాద్ నియోజవకర్గంలో దళిత బంధు పథకాన్ని నిలిపివేయాలని ఈసీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర ఆరోపణలు చేసింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్లే దళిత బంధు ఆగిందంటూ విమర్శలు గుప్పించింది.

ఇది ఇలా ఉండగా.. దళిత బంధుపై పలువురు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం హైకోర్టులో మూడు పిటిషన్లు దాఖలయ్యాయి. మల్లెపల్లి లక్ష్మయ్య, కాంగ్రెస్ ఏఐసీసీ మెంబర్ బక్క జడ్సన్, బీజేపీ నేత డా.చంద్రశేఖర్ పిటీషన్ దాఖలు చేశారు. హుజరాబాద్‌లో దళిత బంధు యధావిధిగా కొనసాగించాలని కోరారు. దళిత బంధుకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. దళితుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన దళిత బంధును యధావిధిగా కొనసాగించాలని పిటిషనర్లు కోరారు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌తో పాటు కరీంనగర్ జిల్లా కలెక్టర్, హుజరాబాద్ రిటర్నింగ్ ఆఫీసర్ కరీంనగర్, పోలీస్ కమిషనర్ ప్రతివాదులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకం తిరిగి ప్రారంభం అవుతుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి: హుజురాబాద్ లో కేసీఆర్ రోడ్ షో.. బహిరంగ సభ రద్దయినట్టే!

Advertisement

తాజా వార్తలు

Advertisement