Thursday, November 28, 2024

NZB | రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యం పట్టివేత

వేల్పూర్, నవంబర్ 8 (ఆంధ్రప్రభ ) : నిజామాబాద్ జిల్లాలోని వేల్పూర్‌ రైస్‌మిల్లులో భారీగా పీడీఎస్‌ బియ్యాన్ని సీజ్‌ చేశారు. స్థానికంగా ఉన్న వజ్ర రైస్‌మిల్లులో పీడీఎస్‌ బియ్యం రీసైక్లింగ్‌ జరుగుతుందనే సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు. కాగా.. ఇప్పటి వరకు 500 క్వింటాళ్ల పైచిలుకు బియ్యాన్ని గుర్తించారు.

మొత్తం 700 క్వింటాళ్లు పైబడి ఉంటుందని సమాచారం. గతంలోనూ ఇదే మిల్లులో రాష్ట్ర టాస్క్‌ఫోర్స్‌ బృందం తనిఖీలు నిర్వహించగా పెద్దమొత్తంలో పీడీఎస్‌ బియ్యం పట్టుబడింది. అయినా మిల్లు యజమాని తీరు మార్చుకోలేదు. దర్జాగా పీడీఎస్‌ రీసైక్లింగ్‌ నిర్వహించడం గమనార్హం.

Advertisement

తాజా వార్తలు

Advertisement