Saturday, April 20, 2024

తెలంగాణ గవర్నర్​ తమిళిసైపై పవన్​ ప్రశంసలు!

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదినం సందర్భంగా ఆమెకు జనసేన అధిపతి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్ భవన్ ను సామాన్యులకూ చేరువ చేసిన ఘనత తమిళిసైకే చెందుతుందని కొనియాడారు. ఇక్కడి వారితో ఆమె మమేమకం అవుతున్న విధానం.. ఆమెలోని మానవీయ కోణానికి అద్దం పడుతుందని ప్రశంసించారు. పేదల పిల్లల విద్య, వారి సర్వతోముఖోభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తున్నారన్నారు. స్వతహాగా వైద్యురాలైన తమిళిసై ఓ తోబుట్టువులా మహిళల ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభ్యున్నతి కోసం పరితపిస్తున్న ఆమెకు ఆ దేవదేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలను అందించాలని ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement