Sunday, September 24, 2023

ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో.. అసిస్టెంట్ ప్రొఫెస్సర్ గా పార రేణుక

ఖమ్మంకి చెందిన పార రేణుక ప‌ట్ట‌ణంలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెస్సర్ గా నియమితమయ్యారు. ప్రముఖ గ్రానైట్ వ్యాపారి పార నాగేశ్వరరావు, సులోచన రాణి దంపతుల చిన్న కుమార్తె రేణుక.
ప్రముఖ అర్ధోపెడిక్ వైద్యులు జాబిశెట్టి గౌతమ్ సతీమణి. పార రేణుక ఎంఎస్ గైనిక్ గా మెడికల్ విద్యను పూర్తి చేశారు.కొంతకాలంగా ఖమ్మంలో వైద్య సేవలను అందిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం చేసిన వైద్య నియామకాల్లో ఎంపికలో అసిస్టెంట్ ప్రొఫెస్సర్ గా నియమితులయ్యారు.రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా నియామక పత్రంను అందజేశారు. పార రేణుక అసిస్టెంట్ ప్రొఫెస్సర్ గా నియామకం కావడం పట్ల… ఖమ్మం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేశారు.కాగా రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు చేతుల మీదుగా అసిస్టెంట్ ప్రొఫెస్సర్ గా నియమకపత్రంను అందుకున్నారు పార రేణుక. కాగా రేణుక పక్కన ఆమె తండ్రి పార నాగేశ్వరరావు కూడా ఉన్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement