Monday, March 25, 2024

కల్లాల్లోనే ధాన్యం.. వానలతో నీటి పాలవుతున్న వడ్లు..

ప్ర‌భ‌న్యూస్: తెలంగాణలో కొద్ది రోజుల నుంచి కురు స్తున్న వానలతో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం మొత్తం వానపాలవుతుంది. రైతులు పండించిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభిస్తున్నా కొనుగోళ్లు మాత్రం అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తం గా 6,821 కేంద్రాలు ప్రారంభిస్తామని చెప్పిన పౌరసరఫరాల అధికారులు ఇప్పటివరకు 5,027 ప్రారంభించి 12.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో కోతలు పూర్తయి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వచ్చినా తేమ, తాలు పేరుతో కొనుగోలులో జాప్యం ఏర్పడుతోంది.

మరోవైపు కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీసంచులు ఇవ్వడంలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కోత కోసి విక్రయించేందుకు కల్లాలు, కేంద్రాలకు చేరుకున్న వడ్ల కుప్పలు ఎక్కడివి అక్కడే ఉంటున్నాయి. వర్షపు నీటికి తడిసి రంగుమారిన ధాన్యం కొనుగోలు చేస్తారా లేదా అన్న సందిగ్ధంలో రైతులున్నారు. దీంతో పాటు కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యాన్ని కప్పి ఉంచేందుకు అధికారులు టార్పాలిన్‌ పట్టాలను కూడా ఏర్పాటు చేయడం లేదని రైతులు వాపోతున్నారు. టార్పాలిన్‌ పట్టాలు లేకపోవడం, అకాల వానలు వస్తుండడంతో నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement