Wednesday, October 9, 2024

ADB: ప్రభుత్వ భూమిలో రాత్రికి రాత్రే నిర్మాణం…

బెల్లంపల్లి, అక్టోబర్ 2 (ప్రభ న్యూస్) : బెల్లంపల్లి పట్టణంలోని కాల్ టాక్స్ ఏరియాలోని 13వ వార్డు ఓవర్ బ్రిడ్జి పక్కన ఇటీవల కొందరు ప్రభుత్వ భూమిని కబ్జా చేయడానికి ప్రయత్నించారంటూ వార్తలు రావడంతో రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డ్ ఏర్పాటు చేయగా, ఏర్పాటు చేసిన మరుసటి రోజే ఈ భూమి హైకోర్టు పరిధిలో ఉందని రాత్రికి రాత్రి బోర్డు పాతారు.

ఈ విషయంపై రసవత్తరమైన చర్చ జరుగుతుండడంతో, మంగళవారం రాత్రి అదే స్థలంలో ఒక గది ఏర్పాటు చేసి ఆ నంబర్ పై రాత్రికి రాత్రే ఒక రూమ్ వేయడంతో, ఉదయం చూడగానే నిర్మాణం కనబడడంతో ఇది ప్రభుత్వ భూమా, లేక కోర్టు పరిధిలో ఉందా అన్న సందేహాలు మొదలయ్యాయి.

అంతేకాకుండా ఇలాంటి అక్రమ భూ కబ్జాలో నిర్మాణాలకు నాయకులు, అధికారుల అండదండలు కూడా ఉన్నాయన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు స్పందించి ఈ భూమిలో నిర్మించిన నిర్మాణం అక్రమమా, సక్రమమా అని తేల్చాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement