Friday, April 26, 2024

ఇది మ‌న తెలంగాణ సినిమా.. మంత్రి కేటీఆర్ గ్రేట్..శేఖ‌ర్ క‌మ్ముల‌

ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల తెలంగాణ‌లో జ‌రిగిన అభివృద్ధి..సినీ రంగంలో చోటు చేసుకున్న మార్పుల గురించి ఆయ‌న మాట్లాడారు. ‘ఇది మన తెలంగాణ సినిమా’ అని అందరూ గర్వంగా చెప్పుకొనేలా ఇక్కడి సినిమా ఎదిగింది. దీనిని తెలంగాణ సాధించిన గొప్ప సాంస్కృతిక విజయంగా అభివర్ణించవచ్చు అని అన్నారు. హైదరాబాద్‌ నగరం అద్భుతమైన అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. ఇంజినీరింగ్‌ చేసే సమయంలో అమెరికా జీవనవిధానం, అక్కడి విలాసవంతమైన సౌకర్యాలు చూస్తే చాలాగొప్పగా అనిపించేది. ఇప్పుడు హైదరాబాద్‌ కూడా ఆల్‌మోస్ట్‌ అమెరికాను తలపిస్తుంది. ఈ మార్పును నేను ప్రత్యక్షంగా చూశాను. ఇప్పుడు పల్లె ప్రాంతాల్లో ఎక్కడా చూసినా నీళ్లు కనిపిస్తున్నాయి. మంత్రి కేటీఆర్‌ అందరికీ అందుబాటులో ఉండటం చాలాగ్రేట్‌. ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు నన్నెంతగానో ఆకట్టుకుంది.

ప్రభుత్వం అంటే ప్రజలకు దూరంగా ఎక్కడో ఉండేది కాదని, ప్రజలు కూడా ప్రభుత్వంలో భాగస్వాములనే రీతిలో కేటీఆర్‌ పనిచేస్తున్నారు. ఈ విషయంలో కేటీఆర్‌ను అభినందించాల్సిందే! అన్నారు. అలాగే ..పదేండ్ల ముందుకు ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇప్పుడు సినిమాల్లో తెలంగాణ నేపథ్యం, యాస, భాష పెట్టకపోతే ఆ చిత్రాలు ఆడవేమో అనే పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాక ముందు ఈ భాషను క్యారికేచర్‌లా, హాస్యాస్పదంగా, విలనిజానికి సింబల్‌గా కించపరచడం చూశాను. ఇప్పుడు ఆ స్థాయి నుంచి తెలంగాణ నేపథ్యం, భాష మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాగా అవతరించింది. క్రమక్రమంగా పుంజుకొని ఈ నేపథ్యంలో సినిమా చేస్తే బాక్సాఫీస్‌ సక్సెస్‌ అనే స్థాయికి వచ్చింది అని చెప్పుకొచ్చారు.ఫిదా’ చిత్రాన్ని బాన్సువాడ నేపథ్యంలో తెరకెక్కించాం. ఈ సినిమా ద్వారా తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, కుటుంబ జీవన విధానం ఎలా ఉంటాయో చూపించాలనుకున్నా. ప్రస్తుతం తెలంగాణ భాషతోపాటు గ్రామీణ తెలంగాణకు చెందిన కథలు సినిమాగా రావడం గొప్ప అచీవ్‌మెంట్‌. అర్బన్‌ సిటీ రొమాంటిక్‌ కథలు కాకుండా, మట్టివాసనతో తీసే పల్లె కథలు కూడా విజయం సాధిస్తాయనే నమ్మకం ఏర్పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement