Thursday, April 18, 2024

మా దేశంలో పేదల లాగా జీవించి.. ధనికుల లాగా చనిపోతాం.. అలైదా గువేరా

నాన్న చేగువేరా సామాజిక సేవ‌లో ముందు ఉండేవార‌ని విప్లవయోధుడు చేగువేరా కూతురు డాక్టర్ అలైదా గువేరా అన్నారు. ఆడ, మగ అనే వ్యత్యాసం ఉండకూడదని..అందరికీ సమానం అవకాశాలు కల్పిస్తారని అన్నారు.హైద‌రాబాద్ లో ఆమె మాట్లాడారు. తమ దేశంలో పేదల లాగా జీవించి.. ధనికుల లాగా చనిపోతారని వివరించారు. ఎందుకంటే అక్కడ అన్ని వసతులు కల్పిస్తారని తెలిపారు. క్యూబాలో మహిళా ఫెడరేషన్ ఉంటుందని.. మహిళలకు అన్ని రకాల మోటివేషన్ ఉంటుందని తెలిపారు. క్యూబాలో ఆడ, మగ అనే వ్యత్యాసం లేకుండా సమాన అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. కలకత్తా నుండి హైదరాబాద్ వ‌చ్చారు. ఆమెతోపాటు చేగువేరా మనవరాలు ప్రొఫెసర్ ఎస్తే ఫానియా గువెరా కూడా నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా విప్లవ వీరుడు చేగువేరా కూతురు, మనవరాలు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement