Wednesday, December 11, 2024

WGL | రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి.. మ‌రొక‌రికి తీవ్ర‌గాయాలు

రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతిచెంద‌గా, మ‌రొక‌రికి తీవ్ర‌గాయాలైన ఘ‌ట‌న మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలోని మహబూబాబాద్ రోడ్డు త‌హ‌సీల్దార్ కార్యాలయం సమీపంలో జ‌రిగింది.

పూర్తి వివరాల ప్రకారం… మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం బ్రాహ్మణపల్లికి చెందిన గుర్రం సంజయ్ మచ్చలకు చెందిన కొప్పుల బన్నీ అనే ఇద్దరు స్నేహితులు బైక్ పై ఇంటికి వెళ్తున్నారు. ఈ క్రమంలో మహబూబాబాద్ నుండి గూడూరు వైపు వస్తున్న కారు బలంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరికి తీవ్రగాయాలు కాగా నర్సంపేటకు తరలిస్తుండగా గుర్రం సంజయ్ (18) మార్గమధ్యలో మృతిచెందాడు. కొప్పుల బన్నీ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంపై మహబూబాబాద్ జిల్లా ఎస్పీ రామ్నాథ్, గూడూరు పోలీస్ స్టేషన్ లో కేసు పూర్వాపరాలు పరిశీలిస్తుట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement