Friday, December 6, 2024

ADB: విద్యుత్ షాక్ తో ఒక‌రు మృతి…

ఖానాపూర్ రూరల్, సెప్టెంబర్ 22 (ప్రభ న్యూస్) : ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన మేకల రాజమల్లు (65) ఇవాళ‌ ఉదయం తన ఇంటి పక్కన పశువుల కొట్టం నుండి బాత్రూంకి వెళ్లే కరెంటు వైర్ మధ్యలో తెగిపోవడంతో, ఈ కరెంట్ వైర్ ను జాయింట్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు షాక్ తగిలి అరుస్తూ అక్కడే పడిపోయాడు.

వెంటనే అది గమనించిన తన భార్య, ఇతరులు చికిత్స గురించి ప్రభుత్వ ఆసుపత్రి ఖానాపూర్ కు తీసుకువచ్చి డ్యూటీ డాక్టర్ కు చూపించగా… అప్పటికే అతను చనిపోయాడ‌ని తెలిపారు. మృతునికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయినవి. మృతుని భార్య మేకల గంగవ్వ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఖానాపూర్ ఎస్సై రాహుల్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement