Thursday, April 18, 2024

లిఫ్ట్ లో ఇరుక్కొని ఒక‌రు మృతి

లిఫ్ట్ లో ఇరుక్కొని ఒక‌రు మృతిచెందిన విషాద ఘ‌ట‌న‌ హైదరాబాద్‌ లో చోటుచేసుకుంది. బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రోడ్ నెంబర్ 4లో ఉన్న జీఐఎస్ హోటల్ లో సూపర్ వైజర్ గా పనిచేస్తున్న శివాజీ గణేష్ (29) లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ దగ్గర ముద్దం అనే తండాకు చెందిన శివాజీ గణేష్ బతుకు తెరువు కోసం 2019లో హైదరాబాద్ వచ్చాడు. బంజారాహిల్స్‌లో జీఐఎస్‌ హోటల్లో సూపర్ వైజర్‌గా పనిలో చేరాడు. లిఫ్ట్ పాడవడంతో హోటల్ యజమాని లిఫ్ట్ చూడమని చెప్ప‌డంతో లిఫ్ట్ లో దిగి చెక్ చేస్తుండగా సడెన్‌గా లిఫ్ట్ ఆన్ అయింది. కిందికి రావడంతో మధ్యలో ఇరుక్కుపోయాడు. ఇరుక్కుపోయిన గణేష్ కిందదాకా లిఫ్టుతో పాటు రావడంతో మృతిచెందాడు. బంజారాహిల్స్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement