Thursday, April 25, 2024

విద్వేష వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మను జైలుకు పంపాలి : అసదుద్దీన్

మొహ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన బీజేపీ నేత నూపుర్ శర్మను జైలుకు పంపాలని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ… నూపుర్ శర్మపై బీజేపీ చాలా ఆలస్యంగా చర్యలు చేపట్టిందన్నారు. బీజేపీ నేతలు చేసిన తప్పుకు దేశమంతా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నూపుర్ శర్మను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. భారతీయ ముస్లీంలు ప్రశ్నిస్తే క్షమాపణ చెప్పరా అన్నారు. విదేశీయులు అడిగితేనే చెప్తారా అని ప్రశ్నించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement