Friday, December 6, 2024

TG | ఎన్‌టీఆర్ వంద అడుగుల విగ్రహం

  • హైదరాబాద్‌లో ఏర్పాటుకు టీడీపీ స‌న్నాహాలు
  • ఈ ఏడాది ఆఖ‌రుకు ఆవిష్క‌ర‌ణ‌


ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలో వంద అడుగుల ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌డానికి టీడీపీ స‌న్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది చివ‌రి నాటికి విగ్ర‌హావిష్క‌ర‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉత్సాహంతో తెలంగాణలోనూ పార్టీకి పూర్వ‌ వైభవం తీసుకు వచ్చేందుకు ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇప్ప‌టికే ఆ దిశ‌గా అడుగులు వేస్తున్నారు. కొంత మంది నాయ‌కులు చంద్ర‌బాబుకు ట‌చ్‌లో ఉన్నారు. తెలుగు వారు అందరూ ఏకం కావాలనే లక్ష్యంతో ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించార‌ని, టీడీపీకి చెందిన కార్యకర్తలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నార‌ని, ఎన్టీఆర్‌ చేసిన సేవలకు ప్రపంచ దేశాల నుంచి ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చింద‌ని ఆ పార్టీ నాయ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో విగ్ర‌హం ఏర్పాటుకు శ్రీ‌కారం చుట్టార‌ని చెప్ప‌వ‌చ్చు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement