Sunday, December 5, 2021

ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నోటిఫికేసన్.. నేడు, రేపు స్పెషల్ కౌన్సెలింగ్

ప్ర‌భ‌న్యూస్: రాష్ట్రంలోని వివిధ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మిగిలి ఉన్న ఇంజనీరింగ్‌ సీట్లకు ప్రత్యేక కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. నేడు, రేపు రెండు రోజులు ఈ స్పెషల్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ను అధికారులు నిర్వహిస్తారు. ఈ రెండు రోజులు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్న తర్వాత ఈనెల 24న స్పెషల్‌ రౌండ్‌ సీట్లను భర్తీ చేస్తారు. మొత్తం 26,073 సీట్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. గతంలో 39,154 సీట్లకు తుదివిడత కౌన్సెలింగ్‌ నిర్వహించి ఈనెల 12న సీట్లు కేటాయించారు. అందులో 15,152 సీట్లు భర్తీ కాగా ఇంకా 24,002 కన్వీనర్‌ కోటా సీట్లు మిగిలాయి. ఇందులో ఇంజనీరింగ్‌ సీట్లు 19,797 ఉంటే, ఫార్మసీ సీట్లు 4,205 ఉన్నాయి.

పొందిన సీట్లను క్యాన్సల్‌ చేసుకోవాలనుకునే వారు ఈనెల 18వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అయితే మొదటి, ఫైనల్‌ పేజ్‌లో 59,993 మందికి సీట్లను కేటాయించగా అందులో 53,717 మంది కాలేజీలకు ఈనెల 19వ తేదీ వరకు రిపోర్ట్‌ చేశారు. మరో 6276 మంది రిపోర్టు చేయనివారు, సీట్లను రద్దు చేసుకున్నవారు ఉన్నారు. ఇందులో భాగంగానే శనివారం, ఆదివారం వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ నెల 24న సీట్లను కేటాయిస్తారు. సీటు పొందిన అభ్యర్థులు ఈనెల 24 నుంచి 26 వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లించి సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్‌ చేయాలి. అప్పటికీ ఇంకా సీట్లు మిగిలితే ఈనెల 25న స్పాట్‌ అడ్మిషన్లకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నారు. రాష్ట్రం లో మొత్తం ఇంజనీరింగ్‌ సీట్లు 79,790, ఫార్మసీ సీట్లు 4426 ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News