Sunday, May 21, 2023

పంట‌కు బీమా లేదు… రైత‌న్న‌కు ధీమా రాదు…

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో: విపత్తులు రావాలని ఎవరూ కోరుకోరు.. ఒకవేళ వస్తే ఎలాగన్న అంశం గడిచిన నాలుగేళ్ళుగా పెండింగ్‌లోనే ఉంది. ప్రతియేటా ఏదో ఒక రూ పంలో వ్యవసాయ రంగంపై ఊహించవి విపత్కర పరిస్థితులు వచ్చిపడుతూనే ఉన్నాయి. గత సంవత్సరం కూడా భారీ వర్షాలు, వరదలతో అంచనాకందని పంటనష్టం సంభవిం చింది. దాదాపు 18 జిల్లాల్లో అధికారుల బృందాలు పక్షం రోజులపాటు పర్యటించి ప్రభుత్వానికి నివేదికలు అంద జేశాయి. ఆ దస్త్రాలను దుమ్ముదులిపి పరిష్కరించక ముందే వడగండ్ల రూపంలో ఈసారి మళ్ళీ విపత్తు వచ్చిపడింది. ఇదిలా ఉంటే.. 2018 తర్వాత రాష్ట్రంలో పంటల బీమా పథకం అనేది లేకుండా పోయింది. అప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు సంయుక్తంగా, వేర్వేరుగా అమలు చేసే బీమా పథకాలు అప్రకటిత స్థితిలో రద్దయ్యాయి. రాజకీయ వ్యూహాల్లో కొట్టు కుపోయిన అప్పటి పంటల బీమా పథకాలు నేటికీ పునరుద్ధరిం పబడలేదు. వర్షాలు ఏ స్థాయిలో విజృంభించినా, పంటలు ఎన్ని ఎకరాల్లో వరదల పాలైనా.. పరిహారం అందే అవకాశమే లేకపోవడంతో అన్నదాతల ఆందోళన బూడిదలో పోసిన పన్నీరుగానే మిగిలిపోతోంది.

- Advertisement -
   

ప్రస్తుతం గడిచిన నాలుగైదు రోజులుగా దాదాపు 12 జిల్లా ల పరిదిలో తుపాను, వడగండ్లు బీభత్సం సృష్టించాయి. లక్ష లాది ఎకరాల్లో పంటలు పాడై గ్రామాల్లో ఎటు చూసిన రైతుల ఆర్థనాదాలు వినిపిస్తున్నాయి. ఆయా జిల్లాల నుంచి అందిన సమాచారం ప్రకారం అధికారుల ప్రాథమిక అంచనా ప్రకారం లక్షన్నర ఎకరాల్లో పంట నష్టం సంభవించింది. కానీ, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తే అసలు నష్టం 9 లక్షలు పైమాటేనని నిపుణుల అంచనాలున్నాయి. ఈ నష్టం విలువ సరసరిగా రూ.5,400 కోట్లుగా ఉంటుందని, అదికూడా రైతు పంట పెట్టుబడి కోసం ఖర్చుచేసిన వ్యయమేనని రైతు సంఘాల నాయ కులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం దయదలచి ఇస్తే తప్ప పంటల నష్ట పరిహారం రూపంలో పైసా వచ్చే మార్గం లేక అన్నదాత దిగాలు చెందుతున్నారు. వ్యవసాయరంగ నిపుణులు అంచనా ప్రకారం సరాసరిగా నష్టం ప్రతి ఎకరాకు రూ.60 వేల వరకు ఉంటుంది. రైతు కుటు-ంబ సభ్యుల శ్రమ జోడిస్తే అది రూ.90 వేల వరకు చేరుకుంటుంది. విపత్తులకు ఎవరూ బాధ్యులు కాకపోయినా అన్నదాతల ఆరుగాలం శ్రమంతా నీళ్ల పాలు కావడం లక్షలాది కుటుంబాల దుర్భిక్ష పరిస్థితులకు దారితీస్తుంది. 2018 కన్నా ముందు ప్రభుత్వం, రైతుల వాటాతో ప్రీమియం చెల్లించి పంటల బీమా చేయిం చినప్పటికీ వందల కోట్ల నష్టపరిహారం జరిగినా ఒక్క రూపా యి కూడా విడుదల కాలేదు. రైతన్నకు అండగా ఉంటామన్న ప్రభుత్వాలు పట్టించుకోలేని పరిస్థితుల్లో కనీసం పంటల బీమా పథకాలైనా ఆదుకుంటాయనుకుంటే అవేమో ఆటకెక్కాయి. దీంతో పంటనష్టపోయిన రైతులు తమ ఖర్మ అనుకుంటూ దేవుడిపై భారం వేస్తున్నారు.

జరిగిన నష్టానికి బోలెడన్ని నిబంధనలు..
పంటలకు నష్టం జరిగినప్పుడు ప్రభుత్వాలు పరిహారం అందించాలి. పరిహారం అందించే ప్రయత్నాలను ప్రభుత్వాలు ఎప్పుడో మర్చిపోయాయి. దీనికి తోడు, పంట నష్టపరిహారం విషయంలో ప్రభుత్వం లేనిపోని నిబంధనలు పెట్టింది. దీంతో, 33శాతానికి పైగా పంట నష్టపరిహారం వాటిల్లితేనే వ్యవసా యాధికారులు నివేదికలు తయారుచేసే పరిస్థితి ఉంది. ఒకవేళ అధికారులు ప్రభుత్వ నిబంధనల మేరకు నివేదికలను పంపించినప్పటికీ పరిహారం అందడం గగనంగానే మారింది. ఈ ఏడాది వానాకాలంలో అధిక వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నప్పటికీ, అధికారులు నివేదికలకే పరిమితం చేశారు. దీంతో ప్రభుత్వం నుంచి రూపాయి వచ్చిన పాపాన పోలేదు. మళ్లీ యాసంగి సీజన్‌లో సాగుచేసిన మొక్క జొన్న, రెండు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు నేలవాలి నష్టం వాటిల్లినప్పటికీ, ప్రభుత్వ నిబంధనల మేరకు పంట నష్టం జరగలేదని అధికారులు నివేదికలురూ పొందించడం లేదు. చివరకు రైతులకు పరిహారం అందించడం ఏమో కానీ రాజకీయ నాయకుల పరామర్శలే ప్రాప్తతంగా మారాయి.

అటకెక్కిన బీమా పథకాలు..
రైతులు వేసిన పంటలకు నష్టం జరిగినప్పుడు, పరిహారం ఇచ్చి ఆదుకునేందుకు, గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాకారంతో రెండు పంటల బీమా పథకాలు అమలయ్యేవి. మొదటిది.. పంటల బీమా పథకం (ఫసల్‌ బీమా యోజన), రెండోది.. వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం. ఈ పథ కాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లిస్తుండగా, మరికొంత రైతులు చెల్లించేవారు. ఈ పథకా లను ప్రభుత్వాలు ప్రవేశపెట్టినప్పటికీ, సరైన నిబంధనలు లేక రైతుల అభిమానాన్ని చూరగొనలేకపోయాయి. గడిచిన నాలుగేళ్ళ కాలంగా ఆ పథకాల ఊసే లేకుండా పోయింది.

ఇన్సూరెన్స్‌ సంస్థల మీనమేషాలతోనే నో బీమా..
పంటల బీమా పథకంలో భాగంగా.. పంట రుణం పొం దిన రైతుల నుంచి బ్యాంకులు ప్రీమియం వసూలు చేసి ఇన్సూ రెన్స్‌ సంస్థలకు చెల్లించేవి. కానీ పంటనష్టం జరిగినప్పటికీ రైతులకు పరిహారం చెల్లించడంలో ఇన్సూరెన్స్‌ సంస్థలు మీనమేషాలు వేశాయి. దీనికి తోడు, పంట నష్టపోయిన రైతులను యూనిట్‌గా కాకుండా, గ్రామాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో, ఏ ఒక్క రైతుకు పంట నష్టపరిహారం రాలేదు. ఈ పథకంలో లోపాలున్నాయంటూ, ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దుచేసింది.
వాతావరణ ఆధారిత పంటల బీమా..
అధిక ఉష్ణోగ్రతలు, వడగళ్లు, బలమైన ఈదురుగాలులు వంటి వాతావరణ మార్పులతో మామిడి, మిర్చి, పత్తి వంటి పంటలు నష్టపోతే, ఆయా పంటలకు నష్టపరిహారం వచ్చేలా ప్రభుత్వం వాతావరణ ఆధారిత పథకంను ప్రవేశపెట్టింది. ఈ పథకంలో రైతులు చేరినప్పటికీ, పంటనష్టం వాటిల్లితే ఆ నిబంధన, ఈ నిబంధన అంటూ ఇన్సూరెన్స్‌ సంస్థలు పరిహారం అందించేందుకు వెనుకంజ వే శాయి. ఇందుకు ప్రతీ మండలంలో ఏర్పాటు-చేసి న వాతావరణ కేంద్రాలు అందించే సమాచారాన్నే ప్రామాణికంగా తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో పంటనష్టం జరిగినప్పటికీ, వాతావరణ కేంద్రం నుంచి సరైన సమాచారం రాకపోవడంతో పరిహారం ఇచ్చేందుకు ఇన్సూ రెన్స్‌ సంస్థలు నిరాకరించాయి. దీనిపై రైతులు ఆందోళనలు చేశారు. దీంతో ఈ పథకాన్ని సైతం ప్రభుత్వం రద్దుచేసింది.

రాజకీయ పార్టీల కొత్త పాట
ఇటు- అధికార పక్షం, అటు- ప్రతిపక్షం అన్నదాతల కోసం కొత్త బీమా పథకాన్ని తీసుకువస్తామని హామీలు ఇస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న బీమా పథకాలు రైతులకు న్యాయం చేయలేకపోయాయని, రాబోయే రోజుల్లో రైతులందరికి అమోదయోగ్యమైన పంటల బీమా పథకాన్ని తీసుకువస్తా మని భరోసా ఇస్తున్నారు. గ్రామాన్ని యూనిట్‌గా కాకుండా రైతును యూనిట్‌గా తీసుకుంటామని, రైతులు సాగు చేసిన ఏ పంటకు నష్టం జరిగినా ఇన్సూరెన్సు సంస్థ పరిహారం అందించేలా చూస్తామని చెపుతున్నారు. అలాగే, ఇన్సూరెన్సు సంస్థకు చెల్లించే ప్రీమియాన్ని సైతం రైతులపై భారం పడ కుండా ప్రభుత్వమే చెల్లిస్తుందని పాదయాత్రల్లో, భరోసా యాత్రల్లో నేతలు హామీలిస్తున్నారు. అయితే, ఆ పథకాలు వచ్చుడు ఎప్పుడో కాని ఇప్పుడైతే నష్టపోయిన పంటలకు పరి హారం అందించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement