Wednesday, April 24, 2024

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. హనుమంత్ షిండే

పిట్లం, మార్చి 25 (ప్రభ న్యూస్) : కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం పరిధిలోని పిట్లం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జుక్కల్ ఎమ్మెల్యే హనుమాన్ షిండే, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు అధ్యక్షులు పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. రైతుల సంక్షేమ ధ్యేయంగా తెలంగాణలో పాలన కొనసాగుతుందని జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే అన్నారు. పిట్లం ప్రాథమిక సహకార సంఘం నిర్మాణానికి రూ.30లక్షల నిధులు మంజూరయ్యాయన్నారు. భవన నిర్మాణ పనులకు ప్రజాప్రతినిధులు భూమిపూజ చేశారు.

బ్యాంక్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన‌ నాటి నుండి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చేతులెత్తేసినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దాన్యం కొనుగోలు చేసి రైతులకు అండగా నిలబడ్డారని గుర్తుచేశారు. దేశంలోనే ఏ రాష్ట్రం అమలు చేయనన్ని సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రజలకు అందుతున్నాయని వివరించారు. రాబోయే రోజుల్లో దేశంలోనే కేసీఆర్ నాయకత్వంతో ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని బ్యాంక్ చైర్మన్ జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో విండో అధ్యక్షులు శబదం రెడ్డి, జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి, నారాయణరెడ్డి, దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement