Friday, March 29, 2024

కేసీఆర్ పాల‌న‌లో మార్పును గ‌మ‌నించాలి… స‌భాప‌తి పోచారం

కేసీఆర్ పాల‌న వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగిన మార్పును ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌ని, తెలంగాణ రాష్ట్రం ఎలా మార్పు చెందిందనేది మన గమనించాలని సభాపతి ప్రజలకు వివరించారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని, రుద్రూర్, బాన్సువాడ, కోటగిరి మండలాల్లో శుక్రవారం సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సుడిగాలి పర్యటనలు చేపట్టారు. రుద్రూరు మండలం సులేమాన్ నగర్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో ముఖ్య అతిధిగా పాల్గొన్న తెలంగాణన్నారు. నాయకులు పోచారం సురేందర్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా పోచారం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం రాకముందు ప్రతి ఏడాది ఒక్కో శాసనసభ్యునికి రూ.50 లక్షల నియోజకవర్గ అభివృద్ధి నిధులు వచ్చేవన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మొదట రూ.3 కోట్లు, తరువాత రూ.5 కోట్లకు పెంచారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి బాన్సువాడ నియోజకవర్గం మీద ప్రేమతో, అభిమానంతో అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో ఒక్కో గ్రామంలో అభివృద్ధి పనుల కోసం మంజూరు చేసిన నిధులు 2 నుండి 5 కోట్ల రూపాయలు అన్నారు. 11,000 డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం, మౌళిక వసతుల కోసం రూ. 1100 కోట్లు ఖర్చు చేశామ‌న్నారు. 7000 ఇళ్ళు పూర్తయి, లబ్ధిదారులు గృహ ప్రవేశం చేశార‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement