Tuesday, April 23, 2024

నిజామాబాద్ జిల్లాలో ఆరుగురు ఎస్సైల బదిలీ.. ఆర్డ‌ర్స్ ఇచ్చిన పోలీస్ క‌మిష‌న‌ర్‌

నిజామాబాద్ అర్బన్: నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆరుగురు ఎస్ఐలను బదిలీ చేస్తూ నిజామాబాద్ సీపీ కార్తికేయ శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ డీజీపీ ఆదేశాల మేరకు ఈ బదిలీ చేసినట్లు తెలిసింది. అందులో భాగంగా ప్రస్తుతం ఆర్మూర్ పోలీస్ స్టేషన్ రెండవ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న యాదగిరి గౌడ్ ను మాక్లూర్ పోలీస్ స్టేషన్ కు, నవీపేట్ , అటాచ్ మాక్లూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న పెంటా గౌడ్ ను నిజామాబాద్ సిసి ఆర్ బీ కి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ప్రదీప్ కుమార్ గాజుల ను ఆర్మూర్ పోలీస్ స్టేషన్ ఎస్సైగా, ప్రస్తుతం భీమ్ గల్ పోలీస్ స్టేషన్, వి ఆర్ అటాచ్డ్ గా ఉన్న విధులు నిర్వహిస్తున్న గంగుల శ్రావణ్ కుమార్ ను నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా, నిజామాబాద్ ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ 1 గా విధులు నిర్వహిస్తున్న తాళ్ల సాయికుమార్ ను ఆరవ పోలీస్ స్టేషన్ ఎస్సైగా, ప్రస్తుతం 6వ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ ఆంజనేయులు ట్రాఫిక్ ఎస్ఐ గా బదిలీ చేస్తూ నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్ నాగరాజు ఉత్తర్వులు జారీ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement