Wednesday, March 27, 2024

SRSPకి పోటెత్తిన వరద నీరు…

నిజామాబాద్ బ్యూరో : ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు లోకి 4లక్షల 92వేల415 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చి చేరుతున్నట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు ఎగువన ఉన్న మహారాష్ట్ర లోని బాలేగావ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, దీనికి తోడు నిర్మల్ జిల్లాలో అత్యధికంగా వర్షాలు కురవడంతో గడ్డేన్న వాగు నుండి వరద ప్రవాహం ప్రాజెక్ట్ లోకి వస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు 90 టిఎంసి లు కాగా ఆదవారం నాటికి 1082.4 అడుగులు 59.212టిఎంసి ల నీటి నిల్వ ఉన్నట్లు వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement